కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్
కాకతీయ,ఆత్మకూరు : గ్రామ పంచాయితీలు ఆదర్శంగా అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీ సర్పంచులను గెలిపించుకోవాలని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ అన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు పరకాల నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అధికార పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటేనే నిధులు పుష్కలంగా వస్తాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఏకకాలంలో రైతులకు 2లక్షల రుణమాఫీ,ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు,200 యూనిట్ల ఉచిత విద్యుత్,రేషన్ బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు సన్న బియ్యం వంటి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని కొనియాడారు. యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు గడపగడపకు తీసుకువెళ్లి ఓట్లను అడగాలని పిలుపునిచ్చారు. చదువుకున్న యువతి యువకులకు ఉపాధి శిక్షణతో పాటు ఉద్యోగాలు కల్పించే విధంగా భరోసానిస్తున్న వ్యక్తి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అని అన్నారు.టిఆర్ఎస్ గత పది సంవత్సరాల్లో జరిగిన దోపిడీని దౌర్జన్యాలను ప్రజలకు తెలియజేయాలని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులకు నాయకులకు పిలుపునిచ్చారు .టిఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేస్తే బూడిదలో పోసిన పన్నీరుల మిగిలిపోతాయి అన్నారు. ఈ సమావేశంలో యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


