అభివృద్ధే లక్ష్యం… సమస్యల పరిష్కారమే ధ్యేయం
శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్
కాకతీయ, నెల్లికుదురు : గ్రామ అభివృద్ధే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తానని శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ మాదరి ప్రశాంత్ తెలిపారు. మండలంలోని శ్రీరామగిరి గ్రామం ఎస్సీ కాలనీ 9వ వార్డులో శుక్రవారం జేసీబీతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో పదేళ్లుగా కొనసాగుతున్న రోడ్ల శుభ్రపరిచే పనులు, జంగిల్ కట్టింగ్ సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. రోడ్లు శుభ్రంగా మారడంతో కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరమని కోరారు. సమస్య పరిష్కారంపై కాలనీవాసులు సర్పంచ్‌ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామగిరి సుమన్, వార్డు సభ్యులు అరపెల్లి మహేష్, గొల్లపల్లి వేణు, సంద కృష్ణ, మాజీ వార్డు సభ్యుడు బందు రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.


