కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం!
కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
కొత్తగూడెంలో కాంగ్రెస్‌కే ప్రజల మద్దతు
సమష్టి కృషితో భారీ మెజార్టీ లక్ష్యం
పార్టీ కోసం పనిచేసిన వారికి భవిష్యత్తు
సన్నాహక సమావేశంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తేనే మున్సిపల్ వార్డుల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు సమర్థంగా అమలవుతాయని చెప్పారు. కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తోనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యకర్తలే పార్టీకి బలం
అందరూ కలిసి సమిష్టిగా పనిచేస్తేనే గెలుపు సాధ్యమవుతుందని, ప్రతి కార్యకర్త పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీలో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఎంపీ భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ ఆదరిస్తుందని అన్నారు. సమావేశాల్లో టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు, డీసీసీ జిల్లా అధ్యక్షుడు తోట దేవి ప్రసన్న, సంవిధాన్ బచావ్ సభ్యులు జేబీ బాలశౌరి, ఏనుగుల అర్జున్ రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తుళ్ళూరి బ్రహ్మయ్య, ఆళ్ళ మురళి, ఊకంటి గోపాలరావు, నాగేంద్ర త్రివేది, ఐఎన్‌టీయూసీ నాయకులు రజాక్, కనకరాజు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై సమావేశాన్ని విజయవంతం చేశారు.


