కాకతీయ,ఆత్మకూరు : హనుమకొండ జిల్లాలోనే పంచకుట శివాలయం ఎంతో ప్రాశస్తికలిగిన ఆలయమని హనుమకొండ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత అన్నారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని పంచకుట శివాలయాన్ని సందర్శించి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి కళా సంపద విచ్ఛిన్నం కాకుండా ఆలయాన్ని పునః నిర్మాణం చేశారని తెలిపారు. ఆయన వెంట మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొహమ్మద్ ఫారూఖ్, అర్చకుడు శ్రావణ్ శర్మ, కమిటీ అధ్యక్షుడు వంగల బూచి రెడ్డి, శ్రీకాంత్, చంద్రమౌళి తదితరులు ఉన్నారు.
మహాదేవుడిని దర్శించుకున్న డిప్యూటీ కలెక్టర్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


