ఢిల్లీ: ఆ భయమే బాంబ్ బ్లాస్ట్‌కు కారణమా?
కాకతీయ, జాతీయం : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సంభవించిన బాంబు పేలుడు దేశాన్ని కుదిపేసింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని కారులో జరిగిన ఈ పేలుడులో పది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పేలుడు తీవ్రత దృష్ట్యా ఆ ప్రాంతం అంతా ధ్వంసమైంది. అయితే, ఈ ఘటన వెనుక కారణాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
పేలుడు జరిగిన రోజునే, ఫరీదాబాద్‌లో ఓ కశ్మీరీ వైద్యుడు అద్దెకు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్ద నుంచి సుమారు 360 కిలోల అమ్మోనియం నైట్రేట్, డిటోనేటర్లు, మరియు మందుగుండు సామగ్రి స్వాధీనం అయ్యాయి. ఈ దాడిలో జమ్మూ–కశ్మీర్, హర్యానా, యూపీ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, ఢిల్లీలో జరిగిన పేలుడు మరియు ఫరీదాబాద్‌లో పట్టుబడిన గ్యాంగ్ మధ్య స్పష్టమైన సంబంధం ఉన్నట్లు తేలింది.
పేలుడు జరిగిన కారులో ఉన్న వ్యక్తిని పోలీసులు డాక్టర్ ఉమర్ మహ్మద్‌గా గుర్తించారు. సోమవారం పట్టుబడ్డ ఉగ్రవాద ముఠాకు, ఉమర్ మహ్మద్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఫరీదాబాద్ దాడుల్లో సహచరులు పట్టుబడటంతో ఉమర్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడని.. తాను కూడా ఎప్పుడైనా అరెస్టవుతాననే భయంతోనే ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు జరిగిన కారులో డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్, మరియు ఇంధనం మిశ్రమంగా వాడినట్లు ఫోరెన్సిక్ నివేదికలు సూచిస్తున్నాయి.
ఇక పేలుడు జరిగే ముందు ఉమర్‌తో పాటు మరెవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాగంజ్, పహార్‌గంజ్ ప్రాంతాల్లోని హోటళ్లు, లాడ్జ్‌ల రికార్డులు చెక్ చేస్తున్నారు. మరోవైపు పుల్వామాలో ఉన్న డాక్టర్ ఉమర్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉమర్ ఏవైనా తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడా? గత కొంతకాలంగా ఎవరితో సంప్రదింపులో ఉన్నాడనే అంశాలపై విచారణ సాగుతోంది.