కాకతీయ, జనగామ : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం విశ్వనాథపురంలో విషాదకర ఘటన జరిగింది. వేటగాళ్ల ఉచ్చులో పడిన జింక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక అటవీ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జింక మృతికి కారణమైన పరిస్ధితులపై దర్యాప్తు చేస్తున్నారు.


