కాకతీయ, ఆత్మకూరు : ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తనుగుల ప్రభాకర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడగా పరిస్థితి విషమించి గురువారం మృతి చెందారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. జాతీయ రహదారి (163) పై ఇండియన్ ఓవెర్సెస్ బ్యాంకు ఎదుట గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.


