కాకతీయ పెద్దపల్లి: గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరిఖని ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డీసీపీ వినాయక విగ్రహాలను దర్శించుకుని అనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడుతూ నిమజ్జనం కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు.
మండపాల వద్ద శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికరులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డీసీపీని సన్మానించారు.


