అక్టోబర్ నెలాఖరుకు డీసీసీ అధ్యక్షుల నియామకం
అక్టోబర్ 4 నుంచి అన్ని జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: అక్టోబర్ నెలాఖరు వరకు తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తవుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇవాళ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న ప్రజాహిత నిర్ణయాలను ఖర్గేకు వివరించారు. ఈసందర్బంగా జిల్లాల్లో సమర్దవంతమైన నాయకత్వాన్ని రూపొందించాలని ఖర్గే ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కునే నాయకులకే బాధ్యతలు అప్పగించాలని నిర్గేశించారు. సంస్థాగత పునర్నిర్మాణం పకడ్డందీగా, ఏ గ్రూపు ఒత్తిడికి లొంగకుండా పనిచేయాలన్నారు. అక్టోబర్ 4వ తేదీ నుంచి ఏఐసీసీ పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. అక్టోబర్ 15వ తేదీ కల్లా ప్రతి జిల్లాకు డీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన ఆరుగురు పేర్లను ఏఐసీసీ పరిశీలకులు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ నెలాఖరుకు డీసీసీలకు కొత్త అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తవుతుందని మహేష్ కుమార్‌గౌడ్ అన్నారు.


