డీసీసీ జంబో కమిటీ
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీలో 80 మంది నియామకం
టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు
జిల్లా పార్టీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శుల జాబితా విడుదల
ఖమ్మం డీసీసీ బలోపేతానికి కీలక నిర్ణయం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీకి విస్తృత స్థాయిలో నియామకాలు చేపట్టినట్లు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మొత్తం 80 మంది సభ్యులతో జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఖమ్మం డీసీసీకి కొత్త ఊపు రానుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉపాధ్యక్షులుగా తుమ్ములూరి లక్ష్మీనరసింహరావు, మలీడు హైమావతి, వేమ్ రెడ్డి సుధాకర్ రెడ్డి, పసుపులేటి దేవేందర్, రంపుడి రోసయ్య, పగడాల మంజుల, బుక్క కృష్ణవేణి, కాపా సుధాకర్, మంకెన శ్రీనివాస్, కెల్లెం వెంకట్ రెడ్డి వంటి పలువురిని ఎంపిక చేశారు. ప్రధాన కార్యదర్శులుగా వల్లూరి పట్టాభి రెడ్డి, కిలారు అనిల్, మొహమ్మద్ ముస్తాఫా, సి.హుస్సేన్, రెంటాల ప్రసాద్, కంచర్ల వెంకట్ నరసయ్య, పులిబండ్ల చిట్టిబాబు, కొప్పుల గోవిందరావు, కొమ్మినేని రమేష్, కమాటల రేణుక, ప్రభావతి రెడ్డి, దొడ్డ పుల్లయ్య, బానోత్ రామ్మూర్తి, పనిత స్రినివాసరావు, గోవిందు శ్రీనివాస్, నల్లమోతు సునీల్, సిరాజుద్దీన్, పి సోమి రెడ్డి, మామిడి వెంకన్న, మొహమ్మద్ హఫీజ్ ఉద్దీన్, రామసాయం హర్షిత్ రెడ్డి, ధరావత్ బాబు నియమితులయ్యారు.
ప్రతినిధులు, కార్యదర్శుల ఎంపిక
స్పోక్స్పర్సన్లుగా కల్వకుంట్ల గోపాలరావు, కర్నాటి రామారావు, పమ్మి అశోక్, గంగిశెట్టి ప్రసాద్, బచ్చలకూర నాగరాజులను నియమించారు. కార్యదర్శులుగా బొజేడ్ల సత్యనారాయణ, దామా స్వరూప, కలిమెల బద్రం, గద్యాల జాన్సి రాణి, ముక్రం ఖాన్, దొనబోయిన శేఖర్, బండి మాధవరావు, సాగుర్తి వెంకట్ నారాయణ, మిర్యాల రమణ గుప్త, భుక్య బాలకృష్ణ, పల్లిపాడు కృష్ణ, ఎస్ కె. అబ్దుల్లా, ఎస్ కె. మస్తాన్, తంబాల శామ్యూల్, సత్తు వీరభద్రం, ముదుముత్తాల గంగరాజు, ఫాతిమా మహమూద్, లకవత్ అర్జున్, పొట్లపల్లి వెంకటేశ్వరరావు, మారసకట్ల బాబు, భ్రమరెడ్డి, యెర్ర సత్యనారాయణ, వున్నం రాజా శంకర్, చింతమల రవి, రెగురి వాసవి, గొల్లపూడి వీరయ్య, నాగటి చంద్రం తదితరులు చోటు దక్కించుకున్నారు.
ఎగ్జిక్యూటివ్ సభ్యుల నియామకం
ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఏసబోయిన శ్రీశ్యామ్, అవెస్ ఖాన్, యన్నం లక్ష్మి, గాథం బాలరాజు, నాయిని సునీత, భుక్య నాయక్, పాటి నర్సయ్య, కొట్టయ రాజశేఖర్, ఆరెం రవి, శ్రీలత, కేత్యపల్లి బాస్కరరావు, అయ్యకట్ల గురువయ్య, నర్రా బద్రకాళి, బానోత్ వినోద తదితరులను ఎంపిక చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, కార్యకర్తలంతా సమిష్టిగా పని చేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా నిలబెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కొత్తగా నియమితులైన నాయకులు ప్రజా సమస్యలపై చురుకుగా స్పందించి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.


