కాకతీయ, పరకాల : దామెర ఎస్ఐ కొంక అశోక్ ఆదివారం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా దామెర గ్రామ శివాలయం సమీపంలో ల్యాదల్ల నుండి హనుమకొండ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి కోతి అడ్డు రావడంతో కిందపడి తలకి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో రక్తస్రావం జరుగుతుండగా, అటుగా వెళుతూ గమనించిన దామెర ఎస్ఐ 108కి ఫోన్ చేయగా అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పోలీసు వాహనంలో గాయాలైన వ్యక్తిని ఆరెపెల్లి వరకు తీసుకొని వెళ్లి అక్కడ 108లో వరంగల్ ఎంజిఎం కు పంపించారు. గాయపడిన వ్యక్తిని పోచారం గ్రామానికి చెందిన కె.మనోహర్ గా గుర్తించారు. ఆపదలో మానవత్వం చూపిన ఎస్సైని ప్రజలు “సెల్యూట్ పోలీస్ “అంటూ ప్రశంసిస్తున్నారు.


