- క్షేత్రస్థాయిలో పరిశీలించిన జాయింట్ కలెక్టర్
కాకతీయ, ఖానాపురం : తుఫాన్ వల్ల నష్టపోయిన పంటలను వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పకడ్బందీగా సర్వే చేయాలని వరంగల్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. శనివారం ఖానాపురం మండలంలో నష్టపోయిన పంటలను స్థానిక రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ ఎఫెక్ట్ తో నష్టపోయిన పంటలను సమన్వయంతో పకడ్బందీగా సర్వే చేపట్టాలని, రైతులకు జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసి నివేదిక రూపంలో అందించాలని అధికారులను ఆదేశించారు. అయినపల్లి గ్రామంలోనీ మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలను సందర్శించారు. మెనూ ప్రకారం మంచి భోజనం అందించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు. పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నంగునూరి రమేష్, ఆర్.ఐలు చెన్నమాల స్వామి, గాయత్రి జీపీఓ స్వప్న, రాజు తదితరులు పాల్గొన్నారు.


