పిడుగుపాటుతో పాడి గేదెలు మృతి
నెక్కొండ మండలం చంద్రుగొండలో ఘటన
కాకతీయ, నెక్కొండ: మండలంలో సోమవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి చెట్టుపై పిడుగుపడడంతో చెట్టుకు కట్టేసిన రెండు గేదెలు మృతి చెందిన ఘటన చంద్రుగొండ గ్రామంలో చోటు చేసుకుంది. దింతో రైతు దాసరి సంపత్ కి చెందిన రెండు పాడి గేదెలు మృతి చెందాయి. గేదెల మృతితో రూ.లక్ష యాభై వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు తెలిపాడు. పిడుగుపాటుతో నష్టం వాటిల్లిన తనను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలని రైతు సంపత్ ఆవేదన వ్యక్తం చేశాడు.


