epaper
Sunday, March 1, 2026
epaper

డాకోయిట్’ టీజర్ రిలీజ్.. యాక్షన్‌తో దూసుకెళ్లిన అడివి శేష్

డాకోయిట్’ టీజర్ రిలీజ్.. యాక్షన్‌తో దూసుకెళ్లిన అడివి శేష్

కాక‌తీయ‌, సినిమా : అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న యాక్షన్–థ్రిల్లర్ మూవీ ‘డాకోయిట్’ టీజర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తొలిసారిగా తెలుగులో నటుడిగా పరిచయం అవుతుండడం విశేషం. టీజర్‌లో అడివి శేష్, మృణాల్ దొంగల పాత్రల్లో కనిపించగా, అనురాగ్ కశ్యప్ విలన్‌గా ఆకట్టుకున్నారు. టీజర్ ఆరంభంలో మృణాల్ తన ప్లాన్‌కు అంగీకరించిందని అడివి శేష్ తన స్నేహితుడితో చెప్పే సీన్ ఆసక్తికరంగా సాగుతుంది. ఆ వెంటనే కథ పూర్తిగా యాక్షన్ మోడ్‌లోకి మారుతుంది. ముఖ్యంగా స్టీరింగ్ పట్టుకుని దూసుకెళ్లే మృణాల్ ఎంట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తర్వాత ఇద్దరూ కలిసి హైస్ట్ మోడ్‌లోకి వెళ్లిన సన్నివేశాలు టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి.

టీజర్ బ్యాక్‌గ్రౌండ్‌లో నాగార్జున, రమ్యకృష్ణ, సౌందర్య నటించిన హిట్ మూవీ ‘హలో బ్రదర్’ (1994)లోని “కన్నె పెట్టారో” పాటను రీమిక్స్ చేసి వినిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. అలాగే ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ కూడా టీజర్‌లో కనిపించారు. టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. “వాహ్.. ఏం టీజర్ కట్ అన్నా”, “ఇంటెన్స్‌గా ఉంది.. పాప్‌కార్న్ రెడీ”, “నటుడిగా అనురాగ్ కశ్యప్ కంబ్యాక్ అదిరిపోయింది” అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.
ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటించాల్సి ఉండగా, సృజనాత్మక భేదాభిప్రాయాల కారణంగా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను ఎంపిక చేశారు.

షానీల్ డియో దర్శకత్వంలో, సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న ‘డాకోయిట్’ చిత్రంలో జైన్ మారీ ఖాన్, కమాక్షి భాస్కర్ల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదట క్రిస్మస్‌కు విడుదల కావాల్సిన ఈ సినిమా, ఇప్పుడు ఉగాది కానుకగా మార్చి 19, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక కాక‌తీయ‌, సినిమా :ప్రధానమంత్రి నరేంద్ర...

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ...

ఏప్రిల్‌ 7న ‘వారణాసి’

ఏప్రిల్‌ 7న 'వారణాసి' కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: సినీ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న...

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్?

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్? కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: టాలీవుడ్ ఐకాన్...

జూలై 9న ‘విశ్వంభర’ !

జూలై 9న ‘విశ్వంభర’ ! కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల...

య‌ష్ త‌గ్గేదేలే..

య‌ష్ త‌గ్గేదేలే.. కాక‌తీయ‌,సినిమా డెస్క్‌ : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల...

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ :...

అనిల్ అరుదైన ఘ‌న‌త‌

అనిల్ అరుదైన ఘ‌న‌త‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img