సైక్లింగ్ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం
అధ్యక్షుడిగా నరేందర్ రెడ్డి కొనసాగింపు
క్రీడాభివృద్ధికి మరింత కృషి చేయాలి
చైర్మన్ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : సైక్లింగ్ క్రీడకు మరింత ప్రోత్సాహం కల్పిస్తూ జిల్లా స్థాయిలో అభివృద్ధికి కృషి చేస్తామని చైర్మన్ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తెలిపారు. క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. వావిలాలపల్లిలో నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా నరేందర్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టగా, అధ్యక్షుడిగా కెప్టెన్ బి. మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సురభి వేణుగోపాల్, కోశాధికారిగా విజగదీశ్వర చారి, ఉపాధ్యక్షులుగా ఎం. అరవింద్, ఎస్. రాజయ్య, ఎస్. అనుదీప్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్. ఇంద్రవేశ్, వి. రమేష్, జై నరేష్ ఎన్నికయ్యారు. డాక్టర్ బంగారు స్వామి, ఎస్. కోదండరాములు ఫ్యాట్రన్లుగా కొనసాగనున్నారు. ఎన్నికల ప్రక్రియను ఏ. కిషన్, పవన్, జనార్దన్ రెడ్డి పర్యవేక్షించగా, టి. రమేష్ రెడ్డి రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించారు.


