- జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల
కాకతీయ, బయ్యారం : మండలంలోని కొత్తపేట పంచాయతీ పరిధిలో పంట పొలాలను శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ రైతు తమ సాగు భూములలో పంటల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలన్నారు. క్లస్టర్ పరిధిలో వ్యవసాయ శాఖ ప్రత్యేక యాప్ ద్వారా అధికారులు నమోదు చేస్తారని తెలిపారు. పంటల నమోదు వలన రైతులకు ఇబ్బందులు కలగకుండా పంటను విక్రయించేందుకు అనువుగా ఉంటుందన్నారు. తుఫాన్ వల్ల కలిగిన నష్టాన్నిసర్వే చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు నాగరాజు, ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.


