శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
ఒకే రోజులో 47,280 మంది దర్శనం
2,906 కోడె మొక్కులు సమర్పణ
కాకతీయ, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా నమోదైంది. ఉదయం నుండి రాత్రి 7:30 గంటల వరకు స్వామివారిని మొత్తం 47,280 మంది భక్తులు దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. స్వామివారికి భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో కోడె మొక్కులు సమర్పించగా మొత్తం 2,906 కోడె మొక్కులు నమోదయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి దర్శనం ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడగా, స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.


