epaper
Thursday, January 15, 2026
epaper

నేరాలు పెరిగాయి.!

నేరాలు పెరిగాయి.!
క‌మిష‌న‌రేట్‌లో 14,456 కేసులు నమోదు
65 శాతం కేసులు మాత్ర‌మే పరిష్కారం
ఆందోళ‌న క‌లిగిస్తున్న పోక్సో కేసుల‌ పెరుగుదల
సైబర్ నేరాల్లో రూ.12.42 కోట్ల మోసాలు
మహిళా భద్రతకు ప్రత్యేక చర్యలు
డ్రంకన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతాం
డ్రగ్స్, రౌడీషీట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం
వార్షిక నివేదిక‌ను వెల్ల‌డించిన వ‌రంగ‌ల్‌ సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌

కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేరాల నివేదికను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నేరాల రేటు 3 శాతం పెరిగినప్పటికీ, పోలీసుల నిరంతర పర్యవేక్షణ, సాంకేతిక నిఘా, ప్రత్యేక బృందాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి సాధించినట్లు సీపీ తెలిపారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో మొత్తం 14,456 కేసులు నమోదు కాగా, వాటిలో 9,098 కేసులను విజయవంతంగా పరిష్కరించి 65 శాతం పరిష్కార రేటు సాధించినట్లు వెల్లడించారు. బాధితులకు త్వరిత న్యాయం అందించాలనే లక్ష్యంతో 1,011 నాన్‌బెయిలబుల్ వారెంట్లను అమలు చేసినట్లు తెలిపారు.

మహిళా భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం

మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ మహిళా పోలీస్ అధికారులతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు సీపీ తెలిపారు. నర్సంపేట పోలీస్ స్టేషన్‌లో కొత్తగా షీటీమ్‌ను ప్రారంభించామని, దీని వల్ల మహిళలపై వేధింపుల కేసులు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. షీటీమ్ కేసులు 2024లో 243 ఉండగా, 2025లో 209కు తగ్గినట్లు వెల్లడించారు. అయితే పోక్సో కేసులు గత ఏడాదితో పోలిస్తే పెరిగినట్లు నివేదికలో వెల్లడైంది. 2024లో 364 పోక్సో కేసులు నమోదు కాగా, 2025లో 405 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇది సమాజానికి హెచ్చరికగా పేర్కొంటూ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ స్థాయిలో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

నేరస్తులకు కఠిన శిక్షలు

నేరాలకు పాల్పడిన వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడినట్లు సీపీ వెల్లడించారు. ఈ ఏడాది 16 కేసుల్లో జీవిత ఖైదు శిక్షలు, మూడు కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షలు విధించబడినట్లు తెలిపారు. ఇవి నేరాలకు పాల్పడేవారికి గట్టి హెచ్చరికగా నిలుస్తాయని అన్నారు. ప్రజలకు త్వరిత న్యాయం అందించేందుకు నిర్వహించిన లోక్ అదాలత్‌ల ద్వారా 9,398 ఎఫ్‌ఐఆర్ కేసులు, 18,197 ఈ-పెట్టీ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో 630 సైబర్ నేరాలు నమోదైనట్లు సీపీ తెలిపారు. పెట్టుబడి మోసాలు, పార్ట్‌టైమ్ జాబ్ మోసాలు, ఓటీపీ మోసాలు, ఏపీకే ఫైల్, కస్టమర్ కేర్ పేరుతో మోసాలు, లోన్ మోసాల ద్వారా మొత్తం రూ.12.42 కోట్ల మేర మోసం జరిగినట్లు వెల్లడించారు.
ఈ కేసుల్లో పోలీసులు రూ.61 లక్షలు రికవరీ చేయగా, ఇప్పటివరకు బాధితులకు రూ.19.70 లక్షలు తిరిగి చెల్లించినట్లు తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. డ్రంకన్ డ్రైవ్‌లో 35,513 మందిపై కేసులు నమోదు చేసి రూ.2.19 కోట్ల జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. 887 మందికి జైలు శిక్షలు, 329 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది 1,424 రోడ్డు ప్రమాదాల్లో 430 మంది మృతి చెందగా, 406 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రమాదాలు, మృతులు కొంత మేర తగ్గినట్లు సీపీ పేర్కొన్నారు. ఎన్‌డిపిఎస్ కేసుల్లో రూ.8.62 కోట్ల విలువైన నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకొని 482 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కొత్తగా 45 రౌడీషీట్లు ఓపెన్ చేయగా, కమిషనరేట్ పరిధిలో మొత్తం 719 మంది రౌడీషీటర్లు ఉన్నారని వెల్లడించారు. భవిష్యత్తులో మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు భద్రతపై మరింత దృష్టి సారిస్తామని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పల్లె పండుగలో పశువుల పరేడ్‌

పల్లె పండుగలో పశువుల పరేడ్‌ నర్సంపేట సంక్రాంతి సంబరాల్లో జీవ జాతులు గేదెలు,...

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌

గట్టమ్మ ఆల‌యంలో గుడి మెలిగే పండుగ‌ ఆదివాసీ నాయకపోడు సంప్రదాయాలతో శుద్ధి పండగ...

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక

ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీక భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అధికారులు...

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రధానం కాకతీయ, దుగ్గొండి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని...

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి

యువకులు క్రీడలపై మక్కువ చూపాలి ---- ఎస్సై కరుణాకర్ కాకతీయ, ఇనుగుర్తి: యువకులు చెడు...

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం

మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యం డోర్నకల్ అభివృద్ధి బిఆర్ఎస్ హయాంలోనే కాంగ్రెస్ హామీలపై మాజీ...

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్

కాంగ్రెస్ లోకి మాజీ జెడ్పిటిసి పద్మ మేఘ నాయక్ - ఎమ్మెల్యే దొంతి...

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి

18 న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి 19న సమ్మక్క–సారలమ్మ గద్దెల పునరుద్ధరణకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img