కాకతీయ, నెల్లికుదురు: విద్యుత్ కొరత లేకుండా కరెంటు సరపర చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు అన్నారు. మండల కేంద్రతొ పాటు గ్రామాల్లో కూడా విద్యుత్ అంతరాయం ఎర్పడుతుందని తక్షణమే సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం నెల్లికుదురు సబ్ స్టేషన్ ఏ ఈ సింధు కి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం సైదులు మాట్లాడుతూ.. ఓకవైపు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నమని చేప్పడం తప్పా అచరణలో అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం చెందుతుందని, రాత్రి వెళ సమయం వర్షాలు కురుస్తుండటంతో విద్యుత్ అంతరాయం వలన ప్రజలు విషపురుగుల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.
గ్రామాల్లో మంచినీటి సమస్య, రైతులు మోటార్లు కాలిపొయే ప్రమాదం ఉందని అశాఖకు సంబంధించిన అదికారులకు సమాచారాన్ని అందిస్తే సమాధానం చేప్పే పరిస్థితి లేదని అయన అన్నారు.
తక్షణమే విద్యుత్ అంతరాయం కాకుండా చర్యలు చేపట్టాలని లేనియెడల రైతులను ప్రజలను సమీకరించి అందోళన చేపడతామని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు తోట యాకయ్, గుగులోతు కనుకు, కడారి యాకయ్య, పవన్ తదితరులు పాల్గొన్నారు.


