కాకతీయ జనగామ టౌన్ : బదిలీపై వెళ్తున్న జనగామా రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ దామోదర్ రెడ్డిని సీపీఎం జనగామా జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఎస్ హెచ్ ఓ గా విధులను సమర్ధవంతంగా నిర్వహించారని కొనియాడారు. గతేడాది జరిగిన ఓ అగ్నిప్రమాద ఘటనను అదుపు చేసి సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. పట్టణంలో పెద్ద ఎత్తున నిర్వహించిన దుర్గమ్మ పండుగ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తుకు చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.
అంతేగాక రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, గంజాయి, డ్రగ్స్ కార్యకలాపాలకు చరమ గీతం పాడారని ఆయన ప్రశంసించారు. సమస్యలపై వచ్చిన బాధితులకు చట్ట పరిధిలో పరిష్కరించారని వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, సుంచు విజేందర్, పొత్కనూరి ఉపేందర్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు బానోతు ధర్మ బిక్షం తదితరులు పాల్గొన్నారు.


