ఇంటింటికి సీపీఐ విరాళాల సేకరణ
కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణ సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటికి సీపీఐ విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక రాజీవ్ చౌక్,బీజోన్ సెంటర్ ఏరియాలలో విరాళాలు సేకరించారు. ప్రజా ఉద్యమాలకు తోడ్పడండి, పోరాటాల పార్టీకి చేయూతనివ్వాలని జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ వర్తక వ్యాపారస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో లింగయ్య,దాస్,రవి,అక్బర్ అలీ,సత్యనారాయణ పాల్గొన్నారు.


