- ఏసీపీ కార్యాలయం తనిఖీ
కాకతీయ, వరంగల్ : వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ బుధవారం వరంగల్ డివిజినల్ కార్యాలయంను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఏసీపీ కార్యాలయమునకు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు ఏఎస్పీ శుభం పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలకగా సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు.
అనంతరం కార్యాలయం పరిశీలించడంతో పాటు ఏసీపీ కార్యాలయంకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఏసీపి స్థాయిలో డివిజన్ పరిధిలో దర్యాప్తు చేపట్టిన కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నిందితుల అరెస్ట్, ఎస్.టి, ఎస్.ఎస్పీ కేసుల స్థితి గతులపై సీపీ ఏఎస్పీని అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలపై సీపీ అరా తీశారు. ఈ తనిఖీల్లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


