బాధిత కుటుంబానికి పరామర్శ
కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని గట్లకుంట గ్రామానికి చెందిన గుర్రం సంతోష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అతని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని భరోసానిచ్చారు.
నూతన వధువరులకు ఆశీర్వాదం
మండల కేంద్రంలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన బయన బిక్షపతి కూతురు, కన్యాయ్ గూడెం గ్రామానికి చెందిన చింతల బిక్షం కుమారుడి వివాహలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఆయన వెంట మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్, నాయకులు యాదగిరి రావు, శ్రీరామ్ సుధీర్, సుధాకర్, సమ్మయ్య, చింతల భాస్కర్, హరీష్ తదితరులు ఉన్నారు.


