కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఉడుత యాకయ్య అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఆయన వెంట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలక బిక్షపతి, నిమ్మల శ్రీనివాస్, లింగయ్య, యాకన్న తదితరులు ఉన్నారు.


