కాకతీయ, గీసుగొండ : ఇటీవల భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన గట్టికిందిపల్లి గ్రామానికి చెందిన పులి అనిల్ కుటుంబాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఉంటామని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


