కాకతీయ, బయ్యారం : మండలంలోని రామచంద్రపురం గ్రామంలో న్యూ డెమోక్రసీ పార్టీ మాజీ దళ కమాండర్ కుర్సం అశోక్ మాతృమూర్తి సోమక్క (89) సోమవారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంకపల్లి సుమన్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు సంపత్ యాదవ్, ఇంద్రారెడ్డి, రాజకీయ పార్టీల నేతలు, మధూకర్ రెడ్డి, గణేష్, గౌని ఐలయ్య, రాంసింగ్, పొమ్మన్న, మదారు తదితరులు బాధితులను పరామర్శించారు.


