కాకతీయ, బయ్యారం : మండలంలోని ఇరుసులాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు ఏనుగుల ఐలయ్య తల్లి ఏనుగుల బతుకమ్మ (80) బుధవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బాణోత్ హరిప్రియ నాయక్ వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని కల్పించారు. అదే గ్రామంలో గత నెల రైల్వే ప్రమాదంలో గాయపడిన కలికినేని సంపత్ కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాతా గణేష్, ఉపాధ్యక్షులు రంగుల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ భద్రన్న, మురళీకృష్ణ, సంపత్, ఉదయ్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.


