epaper
Monday, March 2, 2026
epaper

నాడు అవినీతి… నేడు ప్రలోభాలు!

నాడు అవినీతి… నేడు ప్రలోభాలు!
మళ్లీ పోటీకి దిగిన సిట్టింగ్ కౌన్సిలర్లు
గత పాల‌క మండ‌లిలోని కొంత‌మందిపై తీవ్ర ఆరోపణలు
డబుల్ బెడ్‌రూం ఇండ్లలో అవకతవకలు
నేడు మ‌ళ్లీ బ‌రిలోకి దిగ‌డంపై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : అభివృద్ధి, సంక్షేమం పేరుతో గత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలన ఐదేళ్ల తర్వాత తీవ్ర విమర్శల మధ్య మళ్లీ ప్రజల ముందుకు వస్తోంది. కేటీఆర్ సొంత ఇలాకాగా పేరున్న సిరిసిల్లలో ఈసారి జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలుగా కాకుండా గత పాలనపై ప్రజాభిప్రాయ పరీక్షగా మారాయి. గత ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసేవను పక్కనపెట్టి అధికార మత్తులో వ్యవహరించారన్న ఆరోపణలు విస్తృతంగా వినిపించాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, సంక్షేమ పథకాల అమలులో అవకతవకలు, అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని పెంచాయి.

డబుల్ బెడ్‌రూం ఇండ్లలో అక్రమాలు
డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపుల విషయంలో అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేయడం, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు చేయడం, చివరకు అర్హులకు ఇండ్లు రాకపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. సంక్షేమ పథకాలను కొందరు కౌన్సిలర్లు వ్యక్తిగత లాభాల కోసం వాడుకున్నారన్న ఆరోపణలు బీఆర్ఎస్ పాలనపై మచ్చగా నిలిచాయి. చాలా వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్న అసంతృప్తి ప్రజల్లో బలంగా ఉంది. సమస్య చెప్పుకునేందుకు కౌన్సిలర్లు అందుబాటులో లేకపోవడం, కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడం ప్రజలను విసిగించాయి. కొందరు ప్రజాప్రతినిధులపై భూకబ్జాలు, అక్రమ వసూళ్ల ఆరోపణలు కూడా వినిపించాయి.
ఇవన్నీ కేటీఆర్ ప్రతిష్టకు తీవ్ర నష్టం చేశాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగింది. అభివృద్ధికి మోడల్‌గా ఉండాల్సిన సిరిసిల్లే పాలనా వైఫల్యాలకు చిరునామాగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

మ‌ళ్లీ బ‌రిలోకి దిగ‌డంపై చ‌ర్చ‌..!

ఇప్పుడు అదే సిట్టింగ్ కౌన్సిలర్లు మళ్లీ ఎన్నికల బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. గత పాలనపై సరైన సమాధానం చెప్పకుండా, చేసిన అభివృద్ధిని చూపించకుండా ఈసారి ప్రలోభాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. గత ఐదేళ్ల పాలనను ప్రజలు గుర్తు పెట్టుకుంటారా? నిర్లక్ష్యపూరిత నాయకత్వాన్ని మళ్లీ అంగీకరిస్తారా? లేక ఈసారి జవాబుదారీతనం ఉన్న ప్రతినిధులను ఎన్నుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఓటు ఒక్కరోజు నిర్ణయమే అయినా దాని ప్రభావం ఐదేళ్లు ఉంటుంది. ప్రలోభాలకు తలొగ్గకుండా ప్రజలు సరైన తీర్పు ఇస్తారా అన్నదే ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా నిలిచింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img