అవినీతి కార్యదర్శికి ఉన్నతాధికారుల అండా
ఆధారాలు అందజేసినా చర్యలు శూన్యం
మాజీ ఎంపీటీసీ బీరం రజినీకర్ రెడ్డి
కాకతీయ, ఆత్మకూర్ :
గూడెప్పాడ్ పంచాయితీ కార్యదర్శి పెరుకారి క్రాంతి కుమార్ అవినీతికి పాల్పడితే పూర్తి ఆధారాలతో ఇచ్చిన కూడా ఎంపిఓ విమల, పరకాల డి.ఎల్.పి. ఓ రవిబాబు, హనుమకొండ జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి రమాకాంత్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా అవినీతి పరుడికి అండగా ఉంటున్నారని గూడెప్పాడ్ మాజీ ఎంపీటీసీ బీరం రజినికర్ రెడ్డి ఆరోపించారు. కార్యదర్శికి అండగా ఉంటున్న అధికారుల పై శుక్రవారం హైదరాబాదులోని తెలంగాణ లోకాయుక్తలో రజనీకర్ రెడ్డి, కాంతాల రవీందర్ రె ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గూడెప్పాడ్ గ్రామాపంచాయితీ కార్యదర్శి క్రాంతి కుమార్ అవినీతికి పాల్పడ్డరని కార్యదర్శి పై చర్య తీసుకోవాలని పూర్తి ఆధారాలతో సహా ఇచ్చిన కూడా స్పందించడం లేదని లోకాయుక్త లో ఫిర్యాదు కావడం జరిగిందని తెలిపారు. ఉన్నతాధికారులు అవినీతిపరుడికి వత్తాసు పలుకుతూ ప్రజాధనం దుర్వినియోగం చేసిన కూడా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి దుర్వినియోగానికి పాల్పడ్డ నిధులను తిరిగి గ్రామపంచాయతీలో జమ చేయాలని అధికారులను వారు కోరారు.


