కాకతీయ, గీసుగొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ కట్టమల్లన్న చెరువు వద్ద వినాయక నిమజ్జనాన్ని స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. నిమజ్జ కార్యక్రమం ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా సాగేందుకు మున్సిపల్ శాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా 16వ డివిజన్ పరిధిలోని జాన్‌పాకలో జరిగిన మిలాద్ ఉన్ నబీ వేడుకల్లోనూ కార్పొరేటర్ మనీషా శివకుమార్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి అందించిన ప్రేమ, త్యాగం, సేవా సందేశాన్ని అందరూ ఆచరించాలని ఆమె పిలుపునిచ్చారు.
కార్యక్రమాల్లో ముస్లిం మత పెద్దలు, కట్టమల్లన్న బండ్ ఇన్‌చార్జి మేనక, మున్సిపల్ ఏఈ కె.కృష్ణమూర్తి, వర్క్ ఇన్‌స్పెక్టర్లు ప్రవీణ్, అర్జున్, శ్రావణ్, ఎలక్ట్రికల్ ఏఈ నరేష్, శానిటరీ ఎస్ఐ చరణ్, శానిటరీ జవాన్లు రాజబోయిన రమేష్, పుల్లా రమేష్ తదితరులు పాల్గొన్నారు.


