- ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఒకరికి తీవ్రగాయాలు
కాకతీయ, పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన కొడిశాల సోమయ్య మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..పాలకుర్తి బై పాస్ రహదారి నుంచి ఈరవెన్ను గ్రామానికి వెళ్ళే మార్గంలో ఉన్న కల్యాణ మండపం వద్ద ఓ రైతుకు చెందిన మొక్క జొన్నపంటను కుప్పలుగా ఆరపోసి వాటిపై నల్ల పరదా కప్పారు. శుక్రవారం రాత్రి సోమయ్య తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మొక్కజొన్న కుప్పలను గమనించక పోవడంతో బైక్ అదుపు తప్పింది. దీంతో అతడి తలకు తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం జనగామ ఏరియా హాస్పిటల్లో తరలించారు. ఇప్పటికైనా సంబందించిన అధికారులు వెంటనే స్పందించి రైతులు రహదారులపై ధాన్యం ఆరబోయకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు విన్నవిస్తున్నారు.


