కాకతీయ, నర్సింహులపేట : మండలంలోని అజ్మీరతండ గ్రామ పరిధి బంజర చెరువు సమీపంలో 25 కేవి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను పగలగొట్టి కాపర్ వైరును గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి దొంగిలించారు. గతంలో కూడా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్ ను దొంగిలించారని, అధికారులు చొరవ తీసుకొని నిఘాను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.


