epaper
Friday, April 10, 2026
epaper

పంచాయతీ భవనంపై వివాదం

పంచాయతీ భవనంపై వివాదం
గ్రామసభ లేకుండానే తీర్మానమా?
నిబంధనలకు విరుద్ధంగా స్థల ఎంపిక
సీతారామపురంలో ఏకపక్ష నిర్ణయాలంటూ ఆరోప‌ణ‌లు
అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం
పనులు నిలిపివేసి గ్రామసభ నిర్వహించాలని డిమాండ్

కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : పంచాయతీ భవన నిర్మాణంలో పారదర్శకత పాటించలేదని, గ్రామసభ నిర్వహించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని సీతారామపురం కాలనీ వాసులు తీవ్రంగా ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామంలో పంచాయతీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన స్థల ఎంపిక వివాదాస్పదంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నిబంధనలను పక్కనబెట్టి తమకు అనుకూలంగా వ్యవహరించారని గ్రామస్తులు మండిపడ్డారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం గ్రామసభ నిర్వహణలో అన్ని అనుబంధ గ్రామాల ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ కేవలం ఒక రోజు ముందే సమాచారం ఇచ్చి నామమాత్రంగా సభ నిర్వహించారని ఆరోపించారు. మెజారిటీ ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే కొద్దిమంది సమక్షంలో చేతులెత్తించి నిర్ణయం తీసుకోవడం పారదర్శకతకు విరుద్ధమని తెలిపారు.

హామీలు విస్మరించారంటూ గ్రామస్థుల ఆగ్రహం

ఈ నిర్ణయ ప్రక్రియలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరించి గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆరోగ్య కేంద్రం నిర్మాణ సమయంలో పంచాయతీ కార్యాలయాన్ని హనుమాన్ దేవాలయం సమీపంలోని హామ్లెట్‌లో నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని విస్మరించి పాత ప్రాంతంలోనే పనులు ప్రారంభించడం అన్యాయమని మండిపడ్డారు. పంచాయతీ భవన నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, అన్ని వర్గాల ప్రజలతో పూర్తి స్థాయి గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు

మొక్కజొన్న కొనుగోళ్లకు షరతులు పెట్టొద్దు ఫంగస్ పేరుతో రైతులను వేధించడం దారుణం...

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య...

కాకతీయ రిపోర్టర్‌ను చంపేయాలి

కాకతీయ రిపోర్టర్‌ను చంపేయాలి కొత్తగూడెం నుంచి మనుషులను మాట్లాడు స్కూల్ పర్మిషన్ గురించి...

హస్పుఖాన్ భవనం కూల్చివేత

హస్పుఖాన్ భవనం కూల్చివేత రాయిగూడెం గ్రామంలో కూల్చివేతపై ముస్లింల‌ ఆగ్రహం కాకతీయ, కూసుమంచి :...

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..!

పోటు రంగారావుపై దేశద్రోహం కేసులు ఎత్తివేయాలి..! ప్రజా సమస్యలపై పోరాటం చేసినందుకే కేసులా..? తప్పుడు...

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్

పేరుకే స్వచ్ఛ ఏన్కూర్ నిర్వ‌హ‌ణ‌లేని గ్రామ డంపింగ్ యార్డ్ కాకతీయ, ఏన్కూర్ :...

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్

నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ కాకతీయ ఖమ్మం టౌన్ :...

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి

గ‌డువులోగా గురుకులాల నిర్మాణం పూర్త‌వ్వాలి పోనేక‌ల్లులో అత్యాధునిక వసతులతో భ‌వ‌న నిర్మాణాలు చదువు తో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img