epaper
Saturday, January 24, 2026
epaper

మద్ది మేడారంలో కాంట్రాక్టర్ల జాతర!

మద్ది మేడారంలో కాంట్రాక్టర్ల జాతర!
పైపై పనులతో ల‌క్ష‌ల రూపాయ‌ల‌ దోపిడీ
రూ.9 లక్షల జాతర నిధులు గాలిలో కలిసినట్టేనా?
భక్తుల సౌకర్యాలపై అధికారుల నిర్లక్ష్యం
కాంట్రాక్టర్లకు అండగా కొందరు అధికారులు?
సౌకర్యాల్లేక ప్ర‌తీ జాత‌ర‌లో భ‌క్తుల ఇబ్బందులు
స్థానికుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం

కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని *మద్ది మేడారం*లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న జాతరను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లు భక్తుల కోసమా? కాంట్రాక్టర్ల కోసమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం జాతరను తమకు లాభాల పండుగగా మార్చుకుంటున్నారని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న ఈ జాతర కోసం 9 లక్షల రూపాయలకుపైగా నిధులు విడుదలైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం నామమాత్రంగానే జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి జాతర సమయం రాగానే ఇదే పరిస్థితి కొనసాగుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్లపై మట్టి… మొరంతో పైపై పనులు

భక్తుల సౌకర్యాల పేరుతో నిధులు తెచ్చి రోడ్లపై కేవలం మట్టి, మొరం చల్లేసి పైపై పనులు చేసి డబ్బులు కాజేయడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రోడ్డు పనుల్లో ఎంత మందంతో మొరం వేయాలి, ఎలాంటి మెటీరియల్ ఉపయోగించాలి అనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ, మద్ది మేడారంలో అవేమీ పాటించడం లేదని అంటున్నారు. వేసిన మట్టి, మొరం కూడా ప్రమాణాలకు అనుగుణంగా లేకుండా చల్లినట్టుగా వదిలేస్తున్నారని విమర్శిస్తున్నారు. పంచాయతీరాజ్ అధికారులు, సంబంధిత శాఖల పర్యవేక్షణ పూర్తిగా కరవైందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల జాతర పేరుతో భక్తుల కోసం పనులు చేయకుండా, డబ్బులు ఎలా సంపాదించాలన్న దానిపైనే కాంట్రాక్టర్లు దృష్టి పెట్టారని, ఇందుకు కొందరు అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మక్క జాతర పేరు మీద దోపిడీ జరుగుతోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీస సదుపాయాలూ కరువు

జాతర సందర్భంగా కనీసం తాత్కాలిక ఆస్పత్రి, వైద్య సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, సురక్షిత రహదారులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, అవి ఎక్కడా కనిపించడం లేదని గ్రామస్థులు అంటున్నారు. వన్‌వే రోడ్లు, మూసివేసిన మార్గాలు, పూర్తికాని పనుల వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, భక్తుల అవసరాల కోసం చుట్టుపక్కల రైతులు యాసంగి పంటలు కూడా వేయకుండా త్యాగం చేస్తుంటే, అధికారులు మాత్రం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. మద్ది మేడారం జాతర 1973 సంవత్సరానికి ముందే ప్రారంభమై క్రమంగా విస్తరించిందని, ఏటా భక్తుల సంఖ్య పెరుగుతున్నా సౌకర్యాల విషయంలో మాత్రం ఎలాంటి శాశ్వత అభివృద్ధి జరగడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. “50 సంవత్సరాలుగా ఇక్కడ తాత్కాలిక పనుల పేరుతో నిధులు దోచుకుంటున్నారు. శాశ్వత అభివృద్ధికి ప్రణాళికే లేదు” అని స్థానికుడు మామిండ్ల మోహన్ రెడ్డి విమర్శించారు.

          మామిళ్ళ మోహన్ రెడ్డి

ప్రణాళికలేకుండా పస్తవ్యస్త పనులు

“మద్ది మేడారం జాతరలో తలాతోకా లేకుండా పనులు జరుగుతున్నాయి. భక్తులు విశ్రాంతి తీసుకునే ప్రదేశాల్లోనే మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అది కూడా నాణ్యతలేని మట్టి, ఇసుకతో చేస్తున్నారు. అయినా అధికారులు మౌనం వహిస్తున్నారు” అని గాదే కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి టెండర్ ప్రకారం నాణ్యమైన పనులు చేయించాలి, పూర్తి స్థాయి పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మద్ది మేడారం జాతర వద్ద జరుగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు భక్తుల జాతరా? కాంట్రాక్టర్ల జాతరా? అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.

 

               గాదె కుమారస్వామి

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి

అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అభివృద్ధిలో వేగం దేశమంతా తెలంగాణ...

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ!

కేసముద్రంలో అభివృద్ధి శంకుస్థాపనల పండుగ! రూ.151 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ రూ.23...

విద్యుత్ షాక్‌తో గేదె మృతి

విద్యుత్ షాక్‌తో గేదె మృతి రూ.ల‌క్ష న‌ష్ట‌పోయామ‌ని బాధితురాలి ఆవేద‌న‌ కాకతీయ, ఏటూరునాగారం :...

పారిశుద్ధ్యమే జాతరలో కీలకం

పారిశుద్ధ్యమే జాతరలో కీలకం 285 బ్లాకులుగా జాతర ప్రాంతం విభజన 5,700 టాయిలెట్లు… 5,000...

ఎక్స్‌పర్ట్ టాక్‌తో విద్యార్థుల్లో చైతన్యం

ఎక్స్‌పర్ట్ టాక్‌తో విద్యార్థుల్లో చైతన్యం కాకతీయ, నెల్లికుదురు : మండల కేంద్రంలోని తెలంగాణ...

అగ్రంపహాడ్ జాతరకు సర్వం సిద్ధం

అగ్రంపహాడ్ జాతరకు సర్వం సిద్ధం పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి...

సిట్టింగ్‌కు ఫిట్టింగ్‌

సిట్టింగ్‌కు ఫిట్టింగ్‌ గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌కు మునిసిప‌ల్‌ ఎన్నిక‌ల‌ స‌వాల్! భూపాల‌ప‌ల్లిలో వేడెక్కిన రాజ‌కీయం చైర్మ‌న్ పీఠం...

తొర్రూరు మున్సిపల్‌ పోరులో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

తొర్రూరు మున్సిపల్‌ పోరులో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి కాంగ్రెస్‌ నాయ‌కుల‌కు మంత్రి వాకిటి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img