మృతురాలి కుటుంబసభ్యులకు పరామర్శ
కాకతీయ,గీసుగొండ : మండలంలోని మచ్చాపురం గ్రామానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డా. బోడకుంట్ల ప్రభాకర్, మాజీ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాష్ తల్లి ఎల్లమ్మ ఇటీవల మృతి చెందగా వారిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి పరామర్శించారు. మచ్చాపురంలో మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో చొక్కం శ్రీనివాస్, ములక ప్రసాద్, రాజిరెడ్డి, తుమ్మనపల్లి శంకర్ రావు, గట్ల బిక్షపతి, కామని భాస్కర్, గోనె ముకుందం, ఎంబడి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


