కాకతీయ, బయ్యారం : మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గత కొద్దిరోజుల క్రితం మృతిచెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఇల్లందు నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు బుధవారం హైదరాబాదులోని మాజీ మంత్రి స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించారు. అనంతరం మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. వారి వెంట బయ్యారం మండల అధ్యక్షుడు తాత గణేష్. మండల బీఆర్ఎస్ నాయకులు బానోత్ మురళి కృష్ణ, గంట రాము, రాయల రాజేష్, ఇర్ప రాజేష్ తదితరులు ఉన్నారు.


