గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి శ్రీకారం
కాకతీయ, గీసుగొండ : మండలంలోని రాంపురం గ్రామంలో గ్రామ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రడం భరత్ కుమార్ గురువారం శ్రీకారం చుట్టారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.20 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన గ్రామపంచాయతీ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను సర్పంచ్ ముగ్గుపోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రడం భరత్ కుమార్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి మౌలిక వసతుల కల్పన అత్యంత అవసరమని పేర్కొన్నారు. నూతన భవనం నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని, పరిపాలనా కార్యకలాపాలు మరింత సక్రమంగా సాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ అనిల్, కొమ్మాల సర్పంచ్ కన్నెబోయిన యమున ప్రవీణ్, సూర్య తండా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర, మనుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్, వంచనగిరి సర్పంచ్ కమల బిక్షపతి పాల్గొన్నారు. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ, ఉపసర్పంచ్ పులి సూరయ్య, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ గాజర్ల గోపి, గ్రామ పెద్దలు దర్శనాల కుమారస్వామి, రడం శ్రీధర్, తాబేటీ సదానందం, గజ్జి రవి, దర్శనాల రాజు తదితరులు హాజరయ్యారు


