ప్రభుత్వ నిధులతో మున్నూరు కాపు భవన్ నిర్మాణం
ఖిలా వరంగల్ మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఎన్నిక
ముఖ్య అతిథులుగా హాజరైన 37, 38 డివిజన్ ల కార్పొరేటర్లు
కాకతీయ, ఖిలా వరంగల్: ఖిలా వరంగల్ పడమర కోటలోని మున్నూరు కాపు పరపతి సంఘం 8వ సర్వసభ్య సమావేశ వార్షికోత్సవం ఆదివారం రోజున పడమరకోట ఆంజనేయస్వామి ఆలయంలో సిద్ధంశెట్టి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా 37వ డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ, 38వ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా యాదవ్ లు హాజరైనారు. ఈ సందర్భంగా 37 డివిజన్ కార్పొరేటర్ వేల్పుగొండ సువర్ణ మాట్లాడుతూ మున్నూరు కాపు పరపతి సంఘం భవన నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తానని హామీ ఇచ్చినారు . 38 డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్ మాట్లాడుతూ మున్నూరు కాపు పరపతి సంఘం భవన నిర్మాణం కోసం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ తో చర్చించి పది లక్షలు మంజూరు రూపాయలు చేయించడం జరిగిందని, త్వరలోనే అట్టి పనులు ప్రారంభమవుతాయని భవిష్యత్తులో సంఘం అభివృద్ధి కొరకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చిరు. అనంతరం 8వ సర్వసభ్య వార్షికోత్సవ ఆర్థిక నివేదిక హాజరైన సభ్యుల హర్షధ్వానాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నిక జరిగింది. అధ్యక్షులుగా సిద్ధంశెట్టి అనిల్ కుమార్, కార్యదర్శిగా మందాటి నరేష్, కోశాధికారిగా సిద్ధంశెట్టి పూర్ణచందర్, సహాయ కోశాధికారి శాబోతు స్వామి,ఉపాధ్యక్షులుగా బండి రాజు, కొండ్ర గోపి, సులుగం వేణుగోపాల్, ఇనుముల హరినాద్ , సహాయ కార్యదర్శులుగా ఎనకంటి కోటేశ్వర్, పుప్పాల అశోక్, సహాయ కోశాధికారులుగా ఇనుముల శ్రీనివాస్,వడగం రాజేష్, షా, ఆకుల రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఎన్నికల అధికారులుగా మెట్టు చంద్రమౌళి,మిట్టపల్లి వెంకటేశ్వర్లు, ఇనుముల మల్లేశం వ్యవహరించారు. నూతనంగా ఎన్నికైన సభ్యులచే ఎన్నికల అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు.


