కేశవపట్నంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం..
కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కేశవపట్నం గ్రామంలో బుధవారం సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్‌ఆర్‌జీఎస్ మరియు ఎమ్మెల్యే నిధుల ద్వారా రూ.20 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను ఘనంగా ప్రారంభించారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ఈ పనులు దోహదపడతాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ ఆకుబత్తిని విజయ్ కుమార్,టీపీసీసీ సభ్యులు మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోపాగోని బస్వయ్య గౌడ్, కేశవపట్నం పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


