ఖాకీ కామం..
వివాహితతో కానిస్టేబుల్ అక్రమ సంబంధం
మహిళ భర్త ఫిర్యాదుతో కానిస్టేబుల్‌పై కేసు నమోదు..రిమాండ్‌కు తరలింపు
కాకతీయ ,మహబూబాబాద్ ప్రతినిధి : తన భార్యతో అక్రమ సంబంధ కొనసాగిస్తున్నాడంటూ ఓ బాధితుడు కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేయగా, ప్రాథమిక విచారణ అనంతరం బయ్యారం ఎస్సై తిరుపతి కేసు నమోదు చేశాడు. తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ తమ కాపురాన్ని నాశనం చేస్తున్నాడంటూ ఓ బాధితుడు బయ్యారం స్టేషన్‌లో కానిస్టేబుల్ దినేష్‌పై ఆరోపణలు చేస్తూ ఎస్సై తిరుపతికి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. కానిస్టేబుల్ వివాహేతర సంబధాన్ని కొనసాగించినట్లుగా రూడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే కానిస్టేబుల్ దినేష్‌పై కేసు నమోదు చేసి.. కోర్టుకు రిమాండ్ చేసినట్లు బయ్యారం ఎస్సై తిరుపతి తెలిపారు.


