మార్కెట్లకు వరుస సెలవులు
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లుకు ఈనెల 18 నుంచి 21 వరకు వారాంతపు సెలవులు ప్రకటించారు. 18 శనివారం వారాంతం, 19 నరక చతుర్దశి, 20 దీపావళి, 21 నోముల దీపావళి సందర్భంగా సెలవులు గా ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలిపింది. రైతులు గమనించి తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కు తీసుకురావద్దని తెలిపారు. ఈనెల 22న వ్యవసాయ మార్కెట్లు తిరిగి ప్రారంభమవుతాయని, రైతులు తమ ఉత్పత్తులను తీసుకురావాలని ఆయా మార్కెట్ కమిటీ కార్యదర్శులు కోరారు.


