ప్రజాశీర్వాదంతో కాంగ్రెస్ విజయ పరంపర
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే జోరు
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కాకతీయ, కరీంనగర్ : ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర కొనసాగుతుందని సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సభ్యులు గెలిపించడంతో బ్యాంక్ పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చిందని తెలిపారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే విజయ పరంపర కొనసాగుతుందని నరేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. సుడా నిధులతో పలు అభివృద్ధి పనులు, నగర సుందరీకరణ కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. రాజీవ్ చౌక్ సుందరీకరణతో పాటు రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటు, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ముందు కూడలి సుందరీకరణ, ప్రధాన రహదారులపై డ్రైనేజీలపై వర్టికల్ గార్డెన్లు ఏర్పాటు, అల్గునూర్ బ్రిడ్జిపై గార్డెన్ ఏర్పాటు వంటి పలు పనులు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, కుర్ర పోచయ్య, ఎండి చాంద్, అస్థపురం రమేష్, అనిల్ కుమార్, మిరాజ్, బషీర్, బారీ, ఆంజనేయులు, అష్రఫ్, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.


