epaper
Saturday, November 15, 2025
epaper

అబద్దాల పాల‌న‌లో కాంగ్రెస్‌

అబద్దాల పాల‌న‌లో కాంగ్రెస్‌
వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపెట్టేందుకు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ‌
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీలో భారీగా చేరిక‌లు

కాక‌తీయ‌, హైద‌రాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ శాసనసభ నియోజకవర్గం నుంచి వివిధ పార్టీలకు చెందినా నాయకులు బిజెపిలో పెద్దఎత్తున చేరారు.పార్టీలో చేరిన నాయకులు, కార్యకర్తలకు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పార్టీ కండువా కప్పి ఆహ్వానం తెలిపారు.ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి పాటుపడాలి.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది.యూపీఏ హయాంలో యూరియా కోసం రైతులు బారులు తీరిన క్యూలైన్లలో గొడవలు జరిగి, లాఠీచార్జీలు జరిగిన అనేక ఘటనలు చూశాం.

దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరత లేకుండా, ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా యూరియా పంపిణీ జరుగుతోంది.అయినా ఇటీవల బిజెపిని బద్నాం చేయడానికి కొన్ని శక్తులు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయి.రబీ సీజన్‌ కోసం తెలంగాణకు అవసరమైన యూరియా 9.5 లక్షల మెట్రిక్ టన్నులు. కేంద్రం సరఫరా చేసిన యూరియా: 12.02 లక్షల మెట్రిక్ టన్నులు. ఇది అవసరానికి మించి 2.5 లక్షల టన్నుల అదనపు సరఫరా.అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ఫెర్టిలైజర్ షాపుల ముందు రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే.కేంద్రం పంపిన ఎరువులను రాష్ట్రంలోని కొంతమంది బ్లాక్ మార్కెట్‌కి మళ్లిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్, ఎరువుల డీలర్లపై సరైన మానిటరింగ్ లేకపోవడం, సరఫరా వ్యవస్థపై రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం.. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ పాలనాపరమైన వైఫల్యానికి నిదర్శనం.యూరియా బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేర అవసరమో అంత మేర యూరియా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాల ప్రచారంతో రైతుల్లో అపోహలు సృష్టిస్తోంది.మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వంటి ప్రాంతం కాటన్ సీడ్ బౌల్‌గా పేరుగాంచింది. అలాంటి ప్రాంతాల్లో కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫెర్టిలైజర్ షాపులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్‌కు పాల్పడుతున్నారు.పంచాయతీరాజ్ ఎన్నికల్లో బిజెపి నాయకులు, కార్యకర్తలు.. వార్డు మెంబర్ స్థాయి నుంచి జడ్పీటీసీ స్థాయివరకు సిద్ధంగా ఉండాలి.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు బిజెపి డిమాండ్ చేస్తోంది. అయినా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని బిజెపిపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటు.బిజెపిపై తప్పుడు ప్రచారం చేయడమే కాంగ్రెస్ నాయకుల ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.రాష్ట్రంలో బిజెపి కి మంచి వాతావరణం ఉంది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు మధ్య ఎలాంటి మనస్ఫర్థలు లేకుండా కలిసిమెలిసి పని చేసి బిజెపిని గెలిపించాలి.బిజెపి మనకు తల్లిలాంటి పార్టీ. అలాంటి పార్టీకి ఎవరూ కూడా ద్రోహం చేయరాదు.మహబూబ్ నగర్ ఎంపీ స్థానంతో పాటు మున్సిపాలిటీలు, నారాయణపేట మున్సిపాలిటీ, మక్తల్ చైర్మన్‌ స్థాయిలలో బిజెపి విజయాలు సాధించింది.రానున్న రోజుల్లో బిజెపి రాష్ట్రంలో మరింత బలమైన వాతావరణం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతోంది.గతంలో నేను ఎమ్మెల్సీగా రాష్ట్రవ్యాప్తంగా సేవలందించాను. ఆ సమయంలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ప్రజలు నాపై విశేష ఆదరణ చూపారు.రేపు (జూలై 24) మహబూబ్ నగర్ జిల్లాలో నా పర్యటనలో భాగంగా బిజెపి శ్రేణులంతా ఐక్యతను ప్రదర్శించి ప్రజల్లో మరింత విశ్వాసం పెంచాలి.కొత్తవారు, పాతవారు అనే భేదం లేకుండా నాయకులు, కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పని చేసి బిజెపి ని అధికారంలోకి తీసుకురావడంలో కృషి చేయాలి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్…

హీరో నాగార్జునపై కామెంట్స్ చేస్తూ మంత్రి సురేఖ ట్వీట్... https://twitter.com/iamkondasurekha/status/1988313863826379169 కాకతీయ, వరంగల్ సిటీ...

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఉద్రిక్తత కాకతీయ, హుజురాబాద్:...

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం

జూబ్లీహిల్స్ హ‌స్త‌గ‌తం ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన స‌ర్వే సంస్థ‌లు అన్నింట్లోనూ అధికార పార్టీకి స్పష్టమైన...

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..!

మాగంటి సునిత ఎమోష‌న‌ల్ వీడియో..! జూబ్లీహిల్స్ ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి.. కాక‌తీయ‌, హైదరాబాద్ : జూబ్లీహిల్స్...

కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది

https://twitter.com/TeluguScribe/status/1987795147560722497 కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయాల‌ని చూస్తోంది ఫేక్ స్లిప్పుల‌ను ఎన్నిక‌ల అధికారికి...

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..!

అద్దె చెల్లించలేదు.. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు తాళం..! https://twitter.com/TeluguScribe/status/1987768671163629993 కాక‌తీయ‌, వెబ్‌డెస్క్ : అద్దె చెల్లించకపోవడంతో...

చలి పంజా

చలి పంజా రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన ఉష్ణోగ్ర‌త‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img