epaper
Monday, March 2, 2026
epaper

కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం: బడే నాగజ్యోతి

కాకతీయ, ములుగు : రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, అసెంబ్లీలో కాళేశ్వరంపైన కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి అన్నారు. సోమవారం ములుగు మండలకేంద్రంలో జాతీయ రహదారి163పై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బడే నాగజ్యోతి మాట్లాడారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగుకోట్ల ప్రజల హక్కులను రేవంత్ రెడ్డి కాలరాచాడని ఆమె అన్నారు.

పోరాటాలతో సాధించిన తెలంగాణ గడ్డపై ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్ర ప్రయోజనాల కోసం రేవంత్ ఆరాటపడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని అన్నారు. తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఏపీకి గోదావరి జిల్లాలను రాసి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు అయ్యాయని, అసెంబ్లీలో జరిగిందంతా తెలంగాణను బలిపెట్టి బనకచర్ల కోసం రేవంత్ ఆడిన బాగోతం తప్ప ఇంకోటి కాదని అన్నారు. కాలేశ్వరంపై సీబీఐ విచారణ అనేది ఒక పార్టీ పైన జరుగుతున్న దాడి కాదు మొత్తంగా తెలంగాణను ఏడారిగా మార్చే విద్రోహ చర్య భావిస్తున్నామని, ఒక వైపు రేవంత్ మరోవైపు బాబు ఇంకోవైపు మోడీ ముగ్గురు కలిసి తెలంగాణను శాశ్వతంగా దెబ్బతీసే దుర్మార్గమైన కుట్రలు తెరతీశారని ఆరోపించారు.

తెలంగాణ వరప్రదాయని కాలేశ్వరం ప్రాజెక్టును బలి చేసేందుకు బాబు తెరపైకి తెచ్చిన బనకచర్ల తోనే ఈ మొత్తం కుట్రలకు బీజం పడిందన్నారు. ఒకవైపు బనకచర్ల ముప్పుతో పాటు ఇచ్చంపల్లిని తెరపైకి తెచ్చి మొత్తంగా మేడిగడ్డను ముంచే కుతంత్రం చేస్తున్నారని, తెలంగాణ రైతుకు మరణ శాసనం రాయాలన్నది ముగ్గురు కలిసి ఆడుతున్న పన్నాగమని ఆమె అన్నారు.

కాలేశ్వరం కమిషన్ నుంచి సిబిఐ విచారణ దాకా ప్రతి దాని వెనక మోడీ, చంద్రబాబు, రేవంత్ హస్తం ఉందని, ప్రియాంకగాంధీ సిబిఐ, ఈడీలను ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడానికి వారిని వేధిచడానికి మోడీ వాడుకుంటున్నారని నిలదీయలేదా అని ప్రశ్నించారు. అప్పుడు సిబిఐ తప్పు అయినప్పుడు ఇప్పుడు ఒప్పు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. న్యాయస్థానాలపై నమ్మకం ఉందని కోర్టులో నిలబడి గోష్ నివేదిక బూచీగా చూపెట్టి బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తే పార్టీ శ్రేణులే కాదు, తెలంగాణ ప్రజలు ఊరుకోరని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img