మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి
కాకతీయ,తొర్రూరు : రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తొర్రూరు పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ అధ్యక్షతన సోమవారం పట్టణంలోని 1.2.8 వార్డులలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని, అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదని అన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో తొర్రూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు,తెల్ల రేషన్ కార్డులు అందించడం జరిగిందని, రెండో విడతలో లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామన్నారు.త్వరలో పేదలను ఎంపిక చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ మాజీ సభ్యుడు ముత్తినేని సోమేశ్వరరావు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెదగాని సోమయ్య, చాపల బాపురెడ్డి,డాక్టర్ పొనుగొటి సోమేశ్వరరావు,మంగళపల్లి రామచంద్రయ్య,జీనుగా సురేందర్ రెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్,తూనం శ్రావణ్ కుమార్,ధరావత్ సోమన్న,భూసాని రాము, తాళ్లపల్లి భిక్షం గౌడ్, సుదర్శన్,సమ్మయ్య, నర్కూటి గజానంద్, దొంగరి రేవతి శంకర్,,కుషాల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


