ఆత్మకూరు, కాకతీయ : స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలని వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు. శనివారం ఆత్మకూర్ మండంలోని గూడెప్పాడ్ ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఇనగాల జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన జన్మదిన సందర్బంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞలు తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని, కార్యకర్తలు, నాయకులు ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చేస్తున్న అసత్యపు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని శ్రేణులకు సూచించారు.
ఈ కార్యకమ్రంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ఓరుగంటి మహిపాల్ రెడ్డి, ఆత్మకూరు మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు, దామెర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్, చౌళ్లపల్లి మాజీ సర్పంచ్ కంచె రవి కుమార్, ఆత్మకూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్ తదితరులు పాల్గొన్నారు.


