ఇంటింటి ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణుల జోరు
మల్లంపల్లి గ్రామంలో ప్రచారం ముమ్మరం
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ల్యాద శ్యామ్‌రావు నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, స్థానిక సమస్యలు, అవసరాలపై ఆరా తీస్తూ హ్యాండ్‌బ్యాగ్ గుర్తుకు మద్దతు తెలపాలని గ్రామస్తులను కోరారు. ఆదివారం శాంతినగర్‌లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో శ్యామ్‌రావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి అధికారులతో సమన్వయం చేస్తూ పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రచార బృందాన్ని గ్రామస్తులు సాదరంగా ఆహ్వానిస్తూ చిలక దిద్దిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ చెరుకుపల్లి శ్రీకాంత్ రెడ్డి, ముత్యాల వెంకటేశ్వర్లు, కొంగరి నరేందర్, జింక వేణు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


