epaper
Thursday, April 9, 2026
epaper

కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు

కాంగ్రెస్ హామీలు అమలు కాలేదు
అంగన్వాడీ, ఆశా వర్కర్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం
ఉద్యోగులు, కార్మికులకు నెరవేరని హామీలు..
రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప‌రిష్కారం లేదు
మొక్కజొన్న రైతులకు భారీ నష్టం
మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్

కాకతీయ, హనుమకొండ : హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. హనుమకొండ జిల్లా బాలసముద్రం లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 420 హామీలు, 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలును పూర్తిగా విస్మరించిందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు వంటి అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయలేదని విమర్శించారు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో అంగన్వాడీ, ఆశా వర్కర్ల జీతాలను గణనీయంగా పెంచారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తే అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.

ఉద్యోగులు.. కార్మికులకు స‌మ‌స్య‌లే

రాష్ట్రంలో 300 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆర్టీసీ లాభాల్లో ఉందని చెప్పినా ఉద్యోగులకు జీతాలు, బెనిఫిట్లు ఇవ్వడం లేదన్నారు. విద్యుత్ రంగాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ ప్రభుత్వం 26 వేల మంది ఆర్టిజన్లను పర్మినెంట్ చేసి జీతాలు పెంచిందని తెలిపారు. ప్రస్తుతం ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు తమ డిమాండ్ల కోసం ఆందోళనలు చేస్తున్నారని చెప్పారు. గుండ్లసింగారం గ్రామానికి చెందిన ఆర్టిజన్ పున్నం చందర్ ప్రమాదంలో మరణించగా, అతని కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, భార్యకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి అంశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగాలు ఇవ్వాలని, కాజీపేటను డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు వెంటనే ఇవ్వాలని కోరారు.

రైతుల సమస్యలపై ఆందోళన

ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ మొక్కజొన్న రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మహబూబాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున సాగు జరిగినా ప్రభుత్వ కొనుగోళ్లు చాలా తక్కువగా ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం క్వింటాల్‌కు 2400 మద్దతు ధర ప్రకటించినా రైతులకు కేవలం 1400–1500 మాత్రమే లభిస్తోందని, ప్రతి క్వింటాల్‌కు రైతులు 1000 వరకు నష్టపోతున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షల ఎకరాల్లో సాగు జరిగినా కొనుగోలు కేంద్రాలు తక్కువగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లలో ప్రణాళికలేమి, నిల్వ సదుపాయాల లోపం ఉందని ఆరోపించారు. త్వరలో వరిసాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా సరైన ప్రణాళికలు లేవని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్ఎండీ డ్యాం పరిస్థితులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

మక్క రైతులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెంచకపోతే ఆందోళనలు...

స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత

స్మార్ట్ ఫోన్లతో అంగన్వాడీ సేవల్లో పారదర్శకత పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి దామెర...

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు

ఆర్టిజన్ కార్మికుల సమ్మెకు టీఆర్‌పీ మద్దతు.. కాకతీయ, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి...

మృతురాలి కుటుంబానికి ఇనుగాల పరామర్శ

మృతురాలి కుటుంబానికి ఇనుగాల పరామర్శ కాకతీయ, గీసుగొండ : కాంగ్రెస్ పార్టీ మండల...

సరుకులన్నింటికీ జండా పాట పెట్టాలి

సరుకులన్నింటికీ జండా పాట పెట్టాలి మిర్చి క్వింటాకు 25వేల రూపాయల మద్దతు ధర...

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత

చాపలబండలో పీడీఎస్ బియ్యం పట్టివేత - బియ్యం, వేయింగ్ మెషిన్, ట్రాలీ ఆటో...

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ పరీక్షలు, చికిత్సలు ఉచితంగా అందుబాటులో యువతలో అవగాహన పెంపుపై దృష్టి...

కొమ్మాల అంగడి బహిరంగ వేలం

కొమ్మాల అంగడి బహిరంగ వేలం విశ్వనాథపురం జీపీలో 13 వారాలకు వేలం రూ.36,71,000/- దక్కించుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img