కాకతీయ, పరకాల: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పతనం ప్రారంభమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మంగళవారం రోజు పరకాల నియోజకవర్గంలోని దామెర మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పండుగ శ్రీనివాస్ పండుగ సమత (వార్డ్ మెంబర్), మోర్తాల బాబురావు, గోల్కొండ స్వామి,గోల్కొండ నరేష్ లతో పాటు మరికొంత మంది ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి మాజీ ఎమ్మెల్యే చల్లా..గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని అందుకే ఆ పార్టీ నుండి బిఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కి పతనం ప్రారంభం అవుతుందన్నారు. ప్రజలంతా మళ్ళీ బీఆర్ఏస్ కు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని,వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గులాబి జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గండు రాము,మాజీ వైస్ ఎంపీపీ ఎండి జాకీర్ అలీ,మాజీ సర్పంచ్ పున్నం సంపత్,గ్రామ పార్టీ అధ్యక్షుడు బోనగాని రాజు,కార్యదర్శి పంచగిరి రాజుకుమార్,నాయకులు పున్నం రమేష్,ఇటుకల బాబురావు,ఇటుకల చిన్న రాజు,శ్రీధర్,గోల్కొండ సారంగం,మోర్తాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


