రెండవ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ హవ…
*పరకాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముందంజ..
*రెండవ రౌండ్లో 5 వార్డులలో కాంగ్రెస్ విజయం..
*రెండవ రౌండ్లో 2 వార్డులలో బిఆర్ఎస్ విజయం..
*రెండవ రౌండ్లో ఖాతా తెరవని బిజెపి..
కాకతీయ, పరకాల : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌లో రెండవ రౌండ్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఊపు తీసుకొచ్చాయి. మొత్తం ఏడు వార్డుల ఫలితాలు ప్రకటించగా, అందులో ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు.10,16,19,7,13 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందగా,2, 5 వార్డుల్లో బిఆర్ఎస్ అభ్యర్థులు విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ రౌండ్‌లో బిజెపి ఖాతా కూడా తెరవకపోవడం గమనార్హం.రెండవ రౌండ్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ముందంజలోకి వెళ్లింది. కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా, బిఆర్ఎస్ శ్రేణులు మిగిలిన మూడవ రౌండ్‌పై ఆశలు పెట్టుకున్నాయి. బిజెపి శ్రేణుల్లో మాత్రం నిరాశ వ్యక్తమవుతోంది.ఇంకా మూడవ రౌండ్ కౌంటింగ్ మిగిలి ఉండటంతో తుది ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడవ రౌండ్ ఫలితాలు కీలకంగా మారనున్నాయి.


